19-07-2025 12:25:07 AM
మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
కందుకూరు, జూలై 18 : గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామన్న మాట ఏమైందని? ఒక్కరినైనా కోటీశ్వరులుగా చేశారంటూ మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.
శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మహిళా సంఘాలకు ప్రభుత్వం నుంచి మంజూరైన రెండు కోట్ల వడ్డీ లేని రుణాలను ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో వడ్డీ లేని రుణాల పేరుతో రూ.16 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ప్రభుత్వం....మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు, మహేశ్వరం మండలాలకు చెరో కోటి రూపాయల వడ్డీరహిత రుణాలను విడుదల చేసినట్లు చెప్పారు.
గత ఐదేళ్లుగా ప్రభుత్వానికి మహిళా సంఘాలు క్రమం తప్పకుండా వడ్డీ వసూలువడ్డీ కడితే... ప్రభుత్వం మాత్రం కేవలం రెండు సంవత్సరాల వడ్డీలేని రుణాలను మహిళా సంఘాలకు అందించడం భావ్యం కాదని.... మూడుసంవత్సరాల వడ్డీ లేని రుణాలు కూడా తక్షణమే అందించాలని అని ఆమె డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగా మిగిలిపోయా అంటూ సబితారెడ్డి మండిపడ్డారు. కేవలం ఎన్నికల అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేశారని అంటూ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు.కార్యక్రమంలో పలువురు నాయకులు డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు భారీగా పాల్గొన్నారు.