calender_icon.png 13 January, 2026 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువశక్తికి స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద

13-01-2026 01:22:32 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్,జనవరి 12(విజయ క్రాంతి): యువశక్తికి స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద అని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం స్వామి వివేకానంద 163 వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా యువజన క్రీడా సేవల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ వేడుకలలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, జిల్లా యువజన క్రీడా సేవల శాఖ అధికారి అశ్వక్ అహ్మద్ లతో కలిసి హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.