09-03-2025 12:00:00 AM
కాగు.. ధాన్యం బాగు
ఆ రోజుల్లో జనాలు పప్పులు, ధాన్యం నిల్వ చేసుకోవడానికి కాగులు ఉపయోగించుకునేవారు. ఈ కాగులను ఆరెవిండ్లు, బానలుగా కూడా పిలిచేవారు. పూర్వం చాలా రైతు కుటుంబాల్లో ఇవి కనిపించేవి. ఇలా పెద్ద సైజులో కుండలా కూడా కాగులు ఉండేవి.
పాతాళ గరిగె
పెన్‌పహాడ్, విజయక్రాంతి : పూర్వం ఇండ్లలో నీటి కుళాయిలు, చేతి పంపులు ఉండేవి కావు. ప్రధాన కూడళ్లు వద్ద మాత్రమే చేదబావి ఉండేది. అయితే మంచి నీటిని బకెట్‌తో చేదే క్రమంలో ఒక్కోసారి బావుల్లో పడిపోయేవి. అయితే వాటిని తీయడానికి పాతాళ గరిగె ఉపయోగించి తీసేవారు. ఆ రోజుల్లో ఒకరిద్దరి దగ్గర మాత్రమే ఇవి కనిపించేవి. అప్పట్లో ముఖ్యమైన వస్తువుగా ఇది ఎంతోమందికి ఉపయోగపడింది.