09-03-2025 12:00:00 AM
చిన్న ఎలుకలా ఉండే ఈ జీవిని యూరోపియన్ హెర్జ్‌హాగ్, కామన్ హెర్జ్‌హాగ్ అని పిలుస్తారు. 15 సెం.మీ నుంచి 30 సెం.మీ పొడవు మాత్రమే ఉంటుంది. రెండు కేజీల వరకూ బరువు ఉంటుంది. నల్లటి ముక్కు, గోధుమరంగు ముఖం ఉండే ఈ జంతువు మీద వేలకొద్ది స్పైన్స్(ముళ్లలాంటి చర్మం) ఉంటాయి. 160 మిల్లీమీటర్లు మాత్రమే ఈ పదునైన స్పైన్స్ ఉంటాయి. ఇవి పెద్దయ్యాక 260 మిల్లీ మీటర్లు పెరుగుతాయి. ప్రతి ఒక్కటి రాలిపోయి మళ్లీ వస్తాయి. ఇదో బంతిలా చుట్టుకుంటుంది.
గంటకు ౧౯ కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది. ఈ జీవులు అధికంగా యూరప్ దేశాలయిన ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో కనిపిస్తాయి. ఇవి చిన్న గూళ్లలాంటివి చెట్లమీద, తొర్రల్లో కట్టుకుంటాయి. రాత్రితో పాటు పగలు కూడా చెట్ల ఆకుల్లో నిద్రపోతాయి. వీటికి చూపు తక్కువ. దీంతో ఆహారాన్ని వాసనపట్టి మాత్రమే వెంటాడతాయి. చిన్న పురుగులు, మిడతలను తింటాయి. ఇవి పుట్టిన 32 రోజుల వరకూ చూడలేవు. కళ్లు కనపడవని చెప్పవచ్చు. వెన్నెముక కూడా మెత్తగా ఉంటాయి. వీటిలో 15 రకాల జాతులున్నాయి. హెర్జ్‌హాగ్‌ల జీవనకాలం కేవలం రెండేళ్లు మాత్రమే.