16-08-2024 01:39:07 AM
రాష్ట్రప్రభుత్వానికి మంత్రివర్గ ఉప సంఘం సూచన
చౌక దుకాణాల్లో డిజిటల్ విధానం అమలుపై మొగ్గు
ఈ నెలాఖరులోపు అక్రమ రేషన్‌కార్డులు ఏరివేత
హైదరాబాద్, ఆగస్టు 1౫ (విజయక్రాంతి): అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే మంత్రివర్గ ఉప కమిటీని నియమించి విధివిధానాలు రూపొందిస్తున్నది. దీనిలో భాగంగానే స్వైపింగ్ కార్డుల ద్వారా నిరుపేదలకు రేషన్ ఇవ్వాలని సబ్ కమిటీ సూచిస్తున్నది. చిన్న ఐడీకార్డ్ సైజులో స్వైపింగ్ కార్డు సిద్ధం చేయాలని భావిస్తున్నది. రేషన్ దుకాణాల్లో ఆ కార్డును స్వైప్ చేయగానే కార్డులోని స్విప్ యాక్టివేట్ అవుతుందని, ఆ తర్వాత కంప్యూటర్ మానిటర్‌పై వెంటనే లబ్ధిదారుని వివరాలు, కుటుంబ సభ్యుల పేర్లు పూర్తి సమాచారం కనిపించేలా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తారని తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో ఈ తరహా విధానానికి గ్రీన్‌స్నిగల్ ఇవ్వనున్నట్టు తెలిసింది.
కార్డులకు అర్హులు వీరే..
గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.లక్షన్నర, ౩.౫ ఎకరాలలోపు మాగాణి, ౭ ఎకరాలలోపు చెలక ఉన్నవారు రేషన్‌కార్డు కు అర్హులు. పట్టణాల్లో రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులు. ప్రభుత్వం రేషన్ కార్డులు కొత్తగా జారీ చేయడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా రేష న్ పొందేవారిని గుర్తించి.. వాటిని తొలగించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 86.96 లక్షల మంది ఇప్పుడు రేషన్‌కార్డు దారులు నెలనెలా రేషన్ తీసుకుంటున్నారు.
మరోవైపు ప్రస్తుతం రేషన్‌కార్డుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే సవరణలు, పేర్ల చేర్పులు, మార్పులకు, కుటుంబ సభ్యుల జాబితాతో చేరేందుకు మరో 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్రమ రేషన్ కార్డులపై బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సుమారు 5 లక్షల ఫిర్యాదులు అందాయి. ఈ నెలాఖరులోపు ప్రస్తుత ప్రభుత్వం వాటన్నింటినీ తొలగించనున్నట్లు తెలిసింది.