02-10-2025 12:00:00 AM
జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు
మెదక్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): మెదక్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా అక్టోబర్ 01 నుండి 31 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాస రావు తెలిపారు. ఈ స మయంలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని ఆయన హెచ్చరించారు.
అలాగే ప్రజల/ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక చర్యలు, అశాంతి సృష్టిం చే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. శాంతి భద్రతల నిర్వహణలో ఎవరైనా విఘాతం కలిగిస్తే వా రిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపా రు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఈ విషయంలో పోలీసులు చేపడుతున్న చర్యలకు సహకరించా లని జిల్లా ఎస్పీ కోరారు.