11-10-2025 01:43:44 AM
తహసీల్దార్ కు ఫిర్యాదు చేసిన జిన్నారం రైతులు
జిన్నారం, అక్టోబర్ 10 :జిన్నారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ ఒకటిలో రైతులకు అసైన్డ్ చేసిన భూముల్లో నుంచి ఎలాంటి అనుమతి లేకుండా తప్పుడు పత్రాలతో మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్నారని రైతులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం తహసీల్దార్ దేవదాసును కలిసి రైతులు వినతి పత్రాన్ని అందజేశారు.
తప్పుడు పత్రాలతో గత 20 రోజులుగా రైతుల అసైన్డ్ భూముల నుంచి మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్నారని తహసిల్దార్ కు వివరించారు. హైకోర్టు స్టే ఇచ్చినా మట్టిని అక్రమంగా తవ్వి పరిశ్రమలకు తరలిస్తున్నారని అన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించే వరకు మట్టి తవ్వకాలు, రవాణా చేయొద్దని రైతులు తహసీల్దార్ ను కోరారు.