calender_icon.png 11 October, 2025 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టికెట్ రాని ఆశావహులకు బుజ్జగింపులు

11-10-2025 01:44:54 AM

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన ఆశావహులను ఆ పార్టీ నేతలు బుజ్జగింపులు చేశారు.  భవిష్యత్‌లో సముచిత స్థానం ఉంటుందని హామీలు ఇచ్చారు.  పార్టీ అభ్యర్థి విజయం కో సం కష్టపడి పని చేయాలని సూచించారు. శుక్రవారం మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యా దవ్ నివాసానికి పారీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథం, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి తదిరతులు వెళ్లి మాట్లాడారు.

ఆ తర్వాత మరో నేత సీఎన్ రెడ్డి, బాబాపషియోద్దీన్, సంజయ్‌గౌడ్ తదితరుల నివాసాలకు మంత్రులు పొన్నం, వివేక్ వెళ్లి పార్టీ  గెలుపుకోసం కృషి చేయాలని కోరారు.  జూబ్లీహిల్స్ లో చాలా మంది పోటీ చేయాలని భావించారని, పార్టీ అధిష్టానం నవీన్ యాదవ్‌కు ఇచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.