05-07-2025 12:25:24 AM
బడంగ్ పేట్, జూలై 4: రోహింగ్యాలపై నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ తనకు రక్షణ కల్పించాలంటూ శుక్రవారం మహేశ్వరం బీజేపీ ఇన్చార్జి అందెల శ్రీరాములు పార్టీ రాష్ట్ర నాయకులు బొక్క నరసింహారెడ్డి తో కలిసి మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నాదర్గుల్లోని విజయలక్ష్మి నగర్ కాలనీలో శుక్రవారం ఉదయం అనుమానాస్పదంగా ఒక వ్యక్తి వాహనం నిలిపి సంచరిస్తున్నాడు.
ఇది గమనించి తాను మీరు ఎవరు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారని అంటూ తాను ప్రశ్నించగా అట్టి వ్యక్తి అక్కడి నుంచి పరార్ అయ్యారు. దీంతో తమ పార్టీ కార్యకర్తలు స్పందించి పరారైన వ్యక్తితో పాటు సమీపంలో ఉన్న మరో నలుగురు వ్యక్తులను రోహ్యింగా లు గా గుర్తించి పోలీసులకు అప్పగించామన్నారు.
అనుమానస్పదంగా తన ఇంటి వద్ద సంచరించిన యువకులపై చట్టపరంగా చర్యలు తీసుకొని తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆయన కోరారు. దీనికి స్పందించిన సిఐ నాగరాజు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.