calender_icon.png 23 September, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలపై కఠినం.. ధనికులపై కనికరం!

23-09-2025 12:46:11 AM

-ఆక్సిజన్‌పై శ్వాస తీసుకుంటున్న మహిళ ఇంటి కరెంటు కట్

-విద్యుత్ అధికారులపై మండిపడుతున్న స్థానికులు 

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 22 : పేదలపై కఠినంగా  ధనికులపై కనికరంగా విద్యుత్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. క్యాన్సర్ ఆపరేషన్ ముగించుకొని ఆస్పత్రి లో డబ్బులు కట్టలేక  సొంత ఇంట్లో ఉంటూ ఆక్సిజన్ పై శ్వాస తీసుకుంటున్న మహిళ ఇంటి కరెంటును విద్యుత్ అధికారులు నిలిపివేశారు. ఈ హృదయ విధారక ఘటన  నల్లగొండ జిల్లా కేంద్రంలోని  సోమవారం రహమత్ నగర్లో చోటు చేసుకుంది.

కరెంటు బిల్లు కట్టిన బిల్లు ఆలస్యం అయ్యిందనే కారణంతో లైన్ మెన్లు వెంకన్న, కృష్ణయ్య దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఇంటి యజమానులు  కనికరించమని వేడుకున్నా లైన్మెన్లు వినలేదు. మీ తల్లి అనారోగ్యంతో ఉంటే  మాకేంటి అని రోత మాటలు మాట్లాడారు. చివరికి స్థానిక కౌన్సిలర్ కూడా కలుగజేసుకున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోలేదు.

బడా బాబుల బకాయిలపై ఇలాగే కఠినంగా వసూలు చేస్తారా..? పేదలపై మాత్రమే ప్రతాపం చూపుతున్నారని ఆ కాలనీ ప్రజలు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంటు సమస్య పరిష్కారం కోసం ఫోన్ చేసినా ఫోన్లు లిఫ్ట్ చేయరని  లైన్మెన్లపై స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వీరి ఆగడాలపై ఉన్నతాధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ చేశారు. పేదల ప్రాణాలు లెక్కచేయని ఇలాంటి మానవత్వం లేని లైన్మెన్ల పై నల్లగొండ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు