13-01-2026 12:00:00 AM
కేర్ హాస్పిటల్స్ వైద్యుల హెచ్చరిక
హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): భోగి, సంక్రాంతి, పండుగలు, ఆపై రిపబ్లిక్ డే సుదీర్ఘ వీకెండ్ సెలవులు కలిసి రా వడంతో, వరుసగా జరిగే వేడుకలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని కేర్ హాస్పిటల్స్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. మలక్‌పేటలోని కేర్ హాస్పిటల్స్, సీనియర్ కన్స ల్టెంట్ జనరల్ మెడిసిన్ అయిన డా. డాక్టర్ సయ్యద్ ముస్తఫా అష్రఫ్, హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కార్తికేయ రామన్‌రెడ్డి మాట్లాడు తూ.. జనవరి తొలి కొన్ని వారాల్లో జీవనశైలి సంబంధిత సమస్యలతో అవుట్పేషెంట్ వి భాగానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని వైద్యులు చెపుతున్నారు. అధికంగా తినడం, మద్యం సేవించడం, సరైన నిద్ర లేకపోవ డం, శారీరక చురుకుదనం తగ్గడం వంటి అలవాట్ల ప్రభావం ఈ సమయంలో బయటపడుతుందని తెలిపారు.
పండుగల తర్వా త చాలా మంది అలసట, గ్యాస్ సమస్యలు, షుగర్ నియంత్రణ లేకపోవడం, రక్తపోటు పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో వస్తుంటారు. వేడుకలు మధ్యలో విరామం లేకుండా కొనసాగితే శరీరానికి కోలుకునే సమయం దొరకదు. దీని వల్ల ముఖ్యంగా షుగర్, బీపీ, ఊబకాయం ఉన్నవారిలో సమస్యలు మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంటుంది అని తెలిపారు. పండుగల సమయంలో ఎక్కువగా దెబ్బతినే అవయవాల్లో కాలేయం ముఖ్యమైనది. మ ద్యం, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తరచూ తీసుకోవడం వల్ల ఫ్యాటి లివర్, గ్యా స్ట్రైటిస్, జీర్ణ సమస్యలు పెరుగుతాయి. పం డుగలు ముగిసిన తర్వాత కూడా లక్షణాలు తగ్గకపోయినప్పుడే చాలామంది వైద్యులను సంప్రదిస్తుంటారు అని తెలిపారు. పండుగల అలసట అనుకుని సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, లక్షణాలు కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.