calender_icon.png 14 January, 2026 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివేకానందుడి ఆశయాలు మరువలేనివి

13-01-2026 12:00:00 AM

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వెల్లడి

చేవెళ్ల, జనవరి 12, (విజయక్రాంతి): చేవెళ్లలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అయన సేవలను మార్చి పోవద్దని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ముఖ్యఅతిథిగా హాజరై, చేవెళ్లలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానందు ని ఆదర్శాలు, యువతకు ఆయన ఇచ్చిన సందేశాలు నేటి సమాజానికి ఎంత ముఖ్యమో ఎంపీ గారు వివరించారు.  చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్ రెడ్డి బీజేపీ నాయకులు వైభవ్ రెడ్డి, కుంచం శ్రీనివాస్,  మాణిక్యారెడ్డి, చీర శ్రీనివాస్,  మధుసూదన్ రెడ్డి,  కృష్ణ రెడ్డి,  పత్తి సత్యనారాయణ,  విఠల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పాగా వెంకటేష్,  అభిషేకర్ రెడ్డి, రవి,  జయసింహరెడ్డి,  ప్రకాష్, యాదయ్య,  చందు  కార్యకర్తలు పాల్గొన్నారు.

శామీర్‌పేట్..

శామీర్‌పేట్, జనవరి 12: మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లక్ష్మాపూర్ లో హిందూ యువశక్తి సంఘటన్ ఆధ్వర్యంలో వివేకానంద 163 వ జయంతి ఉత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. వివేకానంద స్వామి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  మానవసేవే మాధవసేవ అని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని హిందూ యువశక్తి సంఘటన్ స్థాపకుడు నాగరాజు (అరుణ్)  కొనియాడారు.  మాజీ సర్పంచ్ సింగం ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ నాగరాజు, కటికల గోపి, తోట పరమేష్, బండి జగన్నాథం, సింగం రాకేష్, సుజిత్ పాల్, వెంకటేష్ నాయక్, సాయి శ్రీనివాస్ చారి , బండి రవి, జనార్ధన్, కొమ్ము లక్ష్మణ్, ప్రవీణ్, శ్రీనివాస్, సురేష్, యువకులు తదితరులు పాల్గొన్నారు.