calender_icon.png 13 October, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రివర్గంలోకి సదానందన్‌ను తీసుకోండి

13-10-2025 01:32:46 AM

కేంద్ర మంత్రి సురేశ్ గోపి 

త్రివేండ్రం, అక్టోబర్ 12: ‘నేనెప్పుడూ నా సినిమా కెరీర్‌ను వదులుకొని కేంద్ర మంత్రి కావాలనుకోలేదు. నా ఆదాయం ఇప్పుడు గణనీయంగా తగ్గింది. నేనిప్పుడు రాజీనామా చేయాలనుకుంటున్నాను. నా స్థానం లో ఎంపీ సీ సదానందన్ మాస్టర్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోండి’ అంటూ కేంద్ర మంత్రి సురేష్ గోపి తన మనసులోని ఎట్టకేలకు బయటపెట్టారు. ఆదివారం కేరళలో బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.