calender_icon.png 13 October, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొలువుల ఖజానా.. ఎంఎస్‌ఎంఈ నమూనా

13-10-2025 01:26:32 AM

  1. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల స్థాపనే నిరుద్యోగానికి మందు
  2. 8 ఏళ్ల క్రితమే నొక్కిచెప్పిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ
  3. రాహుల్ విజన్‌ను అందుకున్న తెలంగాణ ప్రభుత్వం
  4. పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో ప్రణాళిక
  5. గత నెలలో విధానపరమైన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరుగుతు న్నది. ఉద్యోగాల కల్పన లేక యువత నిరాశ, నిస్పృహకు గురవుతున్నారు. ఈ సమస్యలన్నింటికీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈలు) స్థాపనే మందు అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ గుర్తించారు. ఇదే విషయాన్ని 2017 అక్టోబర్ 26న న్యూఢిల్లీలో జరిగిన పంజాబ్‌ె హర్యానా  ఢిల్లీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) సమావేశంలో ప్రకటించారు.

కేవలం పెద్ద పరిశ్రమలపై ఆధారపడటం సరికాదని ఆయన ఆ సమావేశ వేదికగా నొక్కిచెప్పారు. దేశ ఉత్పత్తిలో 40 శాతం, దేశ ఎగుమతుల్లో సగం (50 శాతం) వాటా ఎంఎస్‌ఎంఈలదే. ఇక వ్యవసాయేతర రంగంలో ఉపాధి పొందుతున్న వారిలో 80 శాతం మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది వీటిలో పనిచేస్తున్నవారే. అయినప్పటికీ, దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. ఈ సమస్యకు కొత్త ఎంఎస్‌ఎంఈల స్థాపనే పరిష్కారమని, తద్వారా ఉపా ధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయ ని రాహుల్ విశ్వస్తున్నారు.

చైనాకు దీటైన జవాబు ఇలా..

భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి.. చైనాతో ఆర్థికపరమైన పోటీ. దీనికి ఎంఎస్‌ఎంఈలే సరైన మార్గమని రా హుల్‌గాంధీ స్పష్టం చేశారు. ‘చైనాతో ఎవరూ పోటీపడలేరు. ఒక్క భారత్ తప్ప. ఎంఎస్‌ఎంఈల స్థాపనే అందుకు మార్గం. అవి గొప్ప సంపదను సృష్టిస్తాయి. లక్షలాది ఉద్యోగ అవకాశాలు తీసుకొస్తాయి.’ అని పీహెచ్‌డీసీసీఐ సమావేశంలో పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు.

‘చైనా ప్రస్తుతం రోజుకు సుమారు 50,000 ఉద్యోగాలను సృష్టిస్తున్నది. భారత్ మాత్రం రోజుకు 450 ఉద్యోగాలను మాత్రమే సృష్టించగలుగుతున్నది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల స్థాప న జరిగితే దేశ తయారీ రంగం ఊపందుకుంటుంది. ఇక ప్రభుత్వాలకు సేవారంగంపై ఆధారపడే బాధ తప్పుతుంది. విదేశాలకు ఎగుమతులు సైతం పెరుగుతాయి’ అని స్పష్టం చేశారు.

బ్యాంక్ రుణాలు అవసరం

దేశంలో ఎంఎస్‌ఎంఈల స్థాపన పెరగాలంటే ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు బా్ంయక్‌లు సత్వర రుణాలు అందజేయడం ఎంతోముఖ్యం. ఎంఎస్‌ఎంఈ యూనిట్లను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించి, వాటి స్థాపనకు తగినంత రుణం అందించాల్సి ఉంటుంది. తద్వారా ఎంటర్‌ప్రెన్యూర్స్ పరిశ్రమలు స్థా పించి కొత్త ఉద్యోగాలు సృష్టిస్తారు. దేశంలో పది అతిపెద్ద వ్యాపార సంస్థలకు రుణం.. దేశవ్యాప్తంగా ఎంఎస్‌ఎంఈల స్థాపనకు ఇస్తే సరిపోతుందని ఇప్పటికే రాహుల్‌గాంధీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అంతేకాదు.. ఎంఎస్‌ఎంఈలు అందుబాటులోకి వస్తే 30 రెట్లు ఎక్కువ ఉపాధి అవకాశాలను తీసుకొస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న  నోట్ల రద్దు నిర్ణయం ఒక్క తమిళనాడులోనే 60,000 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు మూతపడ్డాయని, పెద్ద కంపెనీలకు కేటాయించిన మూలధనాన్ని ఎంఎస్‌ఎంఈలకు అందించి ఉంటే ఎంత ఉపాధి సృష్టించగలిగేవారో ఊహించాలని సవాల్ సైతం విసిరారు.

రోల్ మాడల్‌గా తెలంగాణ?

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ దార్శనికతకు అనుగుణంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. రా హుల్ సామాజిక దృష్టి అనుగుణంగా రా ష్ట్రంలో కులగణన చేపట్టింది. ఆర్థిక దృష్టితో చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటుకు బాటలు వేస్తున్నది. రాజకీయ దృష్టితో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నది.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి గత నెల 18న ఈ అంశంపై విధానపరమైన నిర్ణ యం సైతం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ నమూనా విజయవంతమైతే తెలంగాణ యావత్ దేశానికి రోల్ మాడల్‌గా నిలువనున్నది. ఇంకా ఒక అడుగు ముందుకేసి ‘మేడ్ ఇన్ తెలంగాణ’, లేదంటే.. ఇంకా కొన్ని అడుగులు ముందుకు వేసి ‘మేడ్ ఇన్ వరంగల్’ అని స్థానిక బ్రాండ్స్ సృష్టించడం వల్ల మన బ్రాండ్లకు అంతర్జాతీయ మార్కెట్లలోకి దూసుకెళ్లే అవకాశం ఉంది.

తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరగనున్నది. 1978లో అప్పటి ఉమ్మడి ఆంధ్రా సీఎం మర్రి చెన్నా రెడ్డి ప్రవేశపెట్టిన ‘సెట్‌విన్’ వంటి యువత కు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాంటి గొప్ప కార్యక్రమాలకు కొనసాగింపుగా ఎంఎస్ ఎంఈ నమూనా నిలవనున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు.