calender_icon.png 24 October, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొంటాం

24-10-2025 01:25:12 AM

  1. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

వట్టెముల ధాన్యం కొనుగోలు ప్రారంభం

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 23 (విజయ క్రాంతి): జిల్లాలోరైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొంటాం అని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. వేములవాడ రూరల్ మండ లం వట్టెముల గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గు రువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్ లో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దా దాపు జిల్లా వ్యాప్తంగా 240 వరకు కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ. 2389, సాధారణ రకానికి రూ. 2369 మద్దతు ధర కల్పిస్తున్నామని తెలిపారు. సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు రూ. 50 0 అదనంగా బోనస్ అందిస్తామని ప్రకటించారు.

రైతులు అధికారుల సూచన మేరకు ధాన్యం తరలించాలని, తేమ 17 శాతం ఉండేలా చూసుకోవాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభు త్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని విప్ తెలిపారు. రైతులకు ఎల్లప్పడూ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. దేశం లో ఎక్కడా లేని విధంగా రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని విప్ గుర్తు చేశారు.

పార్టీలకు అతీతంగా అన్ని గ్రా మాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు.కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎ లాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు చూడాలని, సరిపడా టార్పలిన్ కవర్లు, గన్ని సంచులు,ఇతర సామాగ్రి అందుబాటులో ఉంచాలని విప్ ఆదేశించారు. రైతులు పం డించిన పంట చివరి గింజా వరకు కొంటామని పేర్కొన్నారు.ప్రజా ప్రభుత్వంలో మహి ళలకు పెద్ద పీట ప్రజా ప్రభుత్వంలో మహి ళా తల్లులను కోటీశ్వరులు చేయడం కోసం ఇందిర మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు..

రాజన్న సిరిసిల్ల జిల్లా పరి ధిలో సుమారు 600 కొట్లు పై చిలుకు బ్యాంక్ లింకజ్ ద్వారా రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు.. రాష్ట్రంలో మొద టి విడతలో మహిళా సమైక్య సంఘాలకు బస్సు మంజూరు చేస్తే వేములవాడ రూరల్ మండల మహిళా సమైక్య కు 30 లక్షలతో బస్సు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు..మహిళలు ముందుకు వస్తె రైస్ మిల్లు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం అన్నారు.