calender_icon.png 22 September, 2025 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా స్థాయి పోటీల్లో ముత్తారం మోడల్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

21-09-2025 10:48:58 PM

ముత్తారం (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా స్థాయి క్రీడా కూటమి 19 సెప్టెంబర్, 20 రాత్రి వరకు జరిగిన పోటీలలో ముత్తారం టీజీ మోడల్ పాఠశాల జూనియర్ కాలేజ్ దారియాపూర్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్-17 కబడ్డీ మొదటి స్థానంలో 10వ తరగతి విద్యార్థులు ఎన్. శ్రవణ్ కుమార్ ఎన్. హర్షవర్ధన్ అండర్-17 ఖో-ఖో మొదటి స్థానం 10వ తరగతి విద్యార్థి ఎస్, సిద్ధు అండర్-14 ఖో-ఖో మొదటి స్థానం 7వ తరగతి విద్యార్థులు అక్షిత్ కుమార్, శశివర్ధన్ లు విజయం సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డా. కేసరి సంతోష్ కుమార్ అధ్యాపకులు విజేతలకు అభినందనలు తెలిపారు. విద్యార్థులను క్రీడలకు తీసుకెళ్లి, మార్గనిర్దేశం చేసిన మోడల్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ స్వప్నను అభినందించారు. టీజీ మోడల్ స్కూల్, దరియాపూర్ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తూ, పాఠశాల ప్రతిష్టను పెంచుతున్నారని మండల విద్యాధికారి హరి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.