calender_icon.png 12 July, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమిళ నటుడు శ్రీరామ్ అరెస్ట్

24-06-2025 12:25:41 AM

చెన్నై, జూన్ 23: మాదకద్రవ్యాల కేసులో ప్రముఖ తమిళ నటుడు శ్రీరామ్‌ను చెన్నై నుంగంబాక్కం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నార్కోటిక్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో నటుడు దాదాపు నాలుగున్నర లక్షల రూపాయల అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్టు పోలీసులు గుర్తించారు.

అతడు 40 సార్లు కొకైన్ కొన్నట్టు ఆరోపణలున్నాయి. ఏఐడీఎంకే టీ వింగ్ మాజీ నేత ప్రసాద్ అరెస్టు.. శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకునేలా చేసింది. ఒక పబ్‌లో ఘర్షణకు దిగగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారింగా డ్రగ్స్ విషయం వెలుగులోకి వచ్చింది.