12-07-2025 11:02:49 PM
ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లెందు నుంచి ఇల్లందు మండలంలోని బోయితండా గ్రామ పంచాయతీ సర్వే తండా వరకు ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) శనివారం ప్రారంభించారు. ప్రయాణికులతో కలిసి ఇల్లెందు నుండి సర్వే తండా వరకు ఎమ్మెల్యే ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల ప్రాంత ప్రజల కోరిక తీరినందుకు సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఇల్లెందు మార్కెట్ చైర్మన్ బానోత్ రాంబాబు, ఆర్టీసి అధికారులు, మండల మాజీ ఎంపీపీ, చీమల నాగరత్నం జానీ, మండల రాము, మండలాధ్యక్షుడు పులి సైదులు, డీసీసీబీ డైరెక్టర్ జనగం కొటేశ్వర్‌రావు, టౌన్ నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం, చిల్లా శ్రీనివాస్‌రావు, జాఫర్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అరెం కిరణ్, నాయకులు కిన్నెర నర్సయ్య, కృష్ణ ప్రసాద్, చెన్నూరి కృష్ణ, చెన్నూరి శ్రీను, తాటి భిక్షం, దండుగుల శివ, బండి ఆనంద్, బానోత్ శారద, పాయం స్వాతి, కల్తీ పద్మ, మంకిడి కృష్ణ, సంపత్, పొడుగు సంపత్, బానోత్ భానుచందర్, బానోత్ రమేశ్, బానోత్ జగదీశ్, గంగావత్ పిక్లా, గంగావత్ పట్టి పాల్గొన్నారు.