12-07-2025 10:53:27 PM
శేరిలింగంపల్లి: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఐఐటి 24వ స్నాతకోత్సవం పురస్కరించుకొని శనివారం బ్రహ్మకుమారీస్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డెబ్జాని ఘోష్ ఎన్ఐటిఐ, ఆయోగ్‌లో డిస్టింగ్విష్డ్ ఫెలో, ఎన్ఐటిఐ ఫ్రంటియర్ టెక్ హబ్ చీఫ్ ఆర్కిటెక్ట్, మాజీ నేషనల్ అసోసియేషన్ అప్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ అధ్యక్షురాలు పాల్గొని విద్యార్థులకు పట్టాలను ప్రధానం చేశారు. ఐఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ గా సందీప్ శుక్లా భాద్యతలు చేపడతారని డైరెక్టర్ ప్రొఫెసర్ పి.జె. నారాయణన్ తెలిపారు. డెబ్జాని ఘోష్ విద్యార్థులతో మాట్లాడుతూ.. ఐదు జీవిత సూత్రాలను సూచించారు.
మొదటిది కృతజ్ఞతతో ప్రారంభించాలని, మిమ్మల్ని ఈ దశకు తీసుకువచ్చిన వారిని గుర్తించి ధన్యవాదాలు తెలపాలని అన్నారు. రెండవది జీవితంలో లక్ష్యం ఉండాలని, మూడవది మీ వైఫల్యాలను అంగీకరించండి. నాల్గవది సత్యనిష్ఠను మీ సోర్స్ కోడ్‌లా కాపాడుకోవాలని, ఐదవది నెట్‌వర్క్‌ల కంటే మానవ సంబంధాలు ముఖ్యం సమస్యలు ఉంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని అన్నారు. అనంతరం వినీత భట్(బిటెక్ సిఎస్ ఇ) గోల్డ్ మెడల్, రవంత్ కుమార్ గుండం, బెస్ట్ ఆల్‌రౌండర్ అవార్డు. ప్రదీప్ కుమార్ పాల్(పీహెచ్డీ) బన్యన్ విద్యార్థులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ అశోక్ ఝుంఝున్‌వాలా మాట్లాడుతూ.. ఈ సంవత్సరం స్నాతకులైన విద్యార్థులు తాము అందించిన విద్యతో సమాజానికి సేవ చేయాలని సూచించారు. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 529 మంది విద్యార్థులు డిగ్రీలు సాధించారు.