12-07-2025 10:29:03 PM
- ఏనుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచే నూతన విధానానికి శ్రీకారం
- మెంటర్స్ గా వ్యవహరించేందుకు ముందుకు వచ్చిన చైతన్య సెంట్రల్ స్కూల్ పూర్వపు విద్యార్థులు
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేద్దామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఎమ్మెల్యే కార్యాచరణ రూపొందించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మొదటి బ్యాచ్ లో 15 మంది విద్యార్థుల ఎంపిక చేయడం జరుగుతుందని, 3-4 నెలల్లో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ మెంటర్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమైనదని, ఏనుగొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మెంటర్స్ గా చైతన్య సెంట్రల్ స్కూల్ పూర్వపు విద్యార్థులు ముందుకు రావడం జరిగిందన్నారు.
పూర్వపు విద్యార్థుల సహాకారం తీసుకుని ఒక్కోక్క విద్యార్థికి ఒక మెంటర్ ను అప్పజెప్పి విద్యార్థుల భవిష్యత్తు కు బాటలు వేస్తున్నట్లు తెలిపారు. తమ కుటుంబ సభ్యులు కూడా పాఠశాలల్లో మెంటర్స్ గా పనిచేసేందుకు భాగస్వామ్యం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి ప్రసన్న, ఇండియన్ ఆర్మీ లో సర్జన్ డాక్టర్ రంజిత్, సిఎంఓ బాలు యాదవ్, సునీల్, ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ కుమారి, నాయకులు రామస్వామి, అజ్మత్ అలి, కృష్ణకాంత్ రెడ్డి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.