calender_icon.png 13 July, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉనికి కోసమే పుట్ట మధు మంత్రిపై అర్ధరహిత ఆరోపణలు

12-07-2025 10:25:59 PM

చట్టం చేసిన పనిని మంత్రి శ్రీధర్ బాబుపై రుద్దడం సిగ్గుచేటు..

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, ముత్తారం మండలం మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం..

ముత్తారం: ఉనికి కోసమే పుట్ట మధు మంత్రిపై అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారని శనివారం ముత్తారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, ముత్తారం మండలం మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక ప్రేమ జంట వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఎంక్వయిరీలో భాగంగా వెళ్లిన ఘటనలో బీఆర్ఎస్ నాయకులు పోలీసు ఉన్నతాధికారులతో దురుసుగా ప్రవర్తించి వాగ్వాదానికి దిగగా అట్టి వ్యక్తులను పోలీసు అధికారులు చట్టరీత్యా అరెస్టు చేయగా ఆ వ్యవహారాన్ని కూడా మంత్రి శ్రీధర్ బాబు, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబుపై రుద్దడం సిగ్గుచేటని అన్నారు. 

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ఎందరో కాంగ్రెస్ కార్యకర్తలపై అక్కరకు రాని కేసులు పెట్టి హింసించిన చరిత్ర కమాన్పూర్ మాజీ జెడ్పిటిసి పుట్ట మధుది అని, ఎంతోమందిని క్రూరంగా హింసించి, భయభ్రాంతులకు గురిచేసి సస్యశ్యామలంగా ఉన్న మంథని నియోజకవర్గంలో ఎన్నో హత్యలతో రక్తసిక్తం చేసిన నీ పాలనను మంథని ప్రజలు ఇంకా మరువలేదన్నారు. నీ అనుచరుడు బిఆర్ఎస్ కార్యకర్త పోలీసులతో ప్రవర్తించిన వీడియోలు మంథని ప్రజలందరూ చూసి చీదర అయినా సిగ్గు లేకుండా కేవలం ఉనికి కోసమే మంత్రిపై మంత్రి కుటుంబంపై అర్థరహిత ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.

ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకే మంథని ప్రజలకు నీ మేక వన్నె పులి వ్యవహారాలు తెలిసి నిన్ను వద్దనుకొని అభివృద్ధి కాంక్షించి మళ్లీ దుద్దిళ్ల కుటుంబానికి పట్టం కట్టిన చరిత్ర మంథని ప్రజలని, మంథని నియోజక వర్గ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు, 24 గంటల్లో ఏ సమయంలో ఏ ఆపద వచ్చిన వెంటనే స్పందించి పరిష్కారం చేసే టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు గురించి మంథని ప్రజలందరికీ తెలుసన్నారు. మరో మారు దుద్దిళ్ల కుటుంబంపై ప్రజల్లో ఉనికి కోసం అర్థరహిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని మా నాయకుడు నేర్పిన సంస్కారంతోనే మీలాగా అడ్డగోలుగా మేము మాట్లాడలేకపోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు వాజీద్ పాషా,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గాదం శ్రీనివాస్, ముత్తారం గ్రామ తాజా మాజీ సర్పంచ్ తూటి రజిత రఫీ, మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు బక్కతట్ల వినీత్,  తదితరులు పాల్గొన్నారు.