12-07-2025 10:47:43 PM
-మా ఆవేదన చూసి ఇందిరమ్మ ఇల్లు మంజూరు
-జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి రుణపడి ఉంటాం
-నర్సంపల్లి గ్రామస్తులు రాఘవేందర్..
జడ్చర్ల: పార్టీ ఏదైనా అభివృద్ధి ముఖ్యమంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy) ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని నర్సంపల్లి గ్రామస్తులు రాఘవేందర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మేము బీజేపీ పార్టీలో ఉన్నప్పటికీ మాకు ఇల్లు లేదని తెలిసి పారదర్శకంగా మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటికే బేస్మెంట్ లెవెల్ బిల్లు కూడా పడిందని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత పదేళ్ల నుంచి కూడా ఇల్లు కోసం ఎంతో ఎదురు చూశామని మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఎదుగుదలకు కృషిచేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేశారు.