12-07-2025 11:00:09 PM
రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్..
లక్షేట్టిపేట (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్(Rajya Sabha Member Anil Kumar Yadav) అన్నారు. శనివారం రాత్రి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మాట్లాడుతూ... కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్యం అందించేందుకే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కృషి చేస్తున్నారని వివరించారు. దీనిలో భాగంగానే లక్షేట్టిపేటలో ఆసుపత్రి, పాఠశాల, కళాశాలలను నిర్మించిన ఘనత ప్రేమ్ సాగర్ రావు కే దక్కిందన్నారు. అనంతరం డిసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ... లక్షేట్టిపేట తో పాటు అన్నీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.