12-07-2025 10:44:46 PM
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ద్వారా ఫ్రీ ట్రైనింగ్, హాస్టల్, సర్టిఫికేట్, ఉద్యోగ అవకాశాల కల్పన..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్(Dr. Reddy's Foundation) ఆధ్వర్యంలో హై క్వాలిటీ హెల్త్‌కేర్ స్కిల్లింగ్ సెంటర్ నందు నిరుద్యోగ యువతులకు ఉచితంగా శిక్షణ అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుందని సెంటర్ మేనేజర్ కె. సాయి వినిత తెలిపారు. శనివారం పట్టణంలో నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఫ్రీ ట్రైనింగ్, హాస్టల్, సర్టిఫికేట్లు అందజేయడంతో, కోర్స్ పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా కరెక్ట్ ఉండదు నైపుణ్యం గల ట్రైనర్స్ ద్వారా అడ్వాన్స్డ్ ల్యాబ్ సదుపాయాలతో ప్రాక్టికల్ శిక్షణ, డిజిటల్ క్లాసులు, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆన్-జాబ్ ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ ఇవ్వబడుతుందని చెప్పారు. ఇప్పటివరకు 270 మంది యువత కోర్సు పూర్తి చేసి ప్రముఖ హాస్పిటల్స్‌లో ఉద్యోగ అవకాశాలు పొందారని, వారి కుటుంబాల జీవన స్థితి మెరుగైందని వివరించారు. ఈ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు 19 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి, కనీసం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలన్నారు. ఆసక్తి ఉన్నవారు 8688983580, 9154909056 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సిబ్బంది నీలిమ, హేమప్రియ, యాదయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.