08-07-2025 11:54:47 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా(Karimnagar District) జమ్మికుంట పట్టణ పరిధిలోని ఎఫ్సిఐ గోదాం వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ నుండి కరీంనగర్ కు గంజాయి రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించగా అనుమాదాస్పదంగా నలుగురు వ్యక్తులు కనబడడంతో వారిని విచారించగా గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. వారిని అదుపులో తీసుకొని పదిహేను కిలోల గంజాయిని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.