calender_icon.png 17 November, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీబీజీకేఎస్ రాష్ట్ర సమావేశం

17-11-2025 12:39:49 AM

యూనియన్ వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి

మణుగూరు, నవంబర్ 16 (విజయక్రాంతి) : రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటు న్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంగళవారం ఏరియాలోని పీవీ కాలనీ జయ శంకర్ సార్ భవన్ లో టీబీజీకేఎస్ రాష్ట్ర సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహి స్తున్నామని, యూనియన్ ఏరియా ఉపాధ్యక్షులు నాగెల్లి వేంకటేశ్వర్లు ఆదివారం మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశానికి సంఘం టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యా ల రాజిరెడ్డి, రాష్ట్ర నాయకులు, సింగరేణి వ్యాప్తంగా సెంట్రల్ కమిటి , బ్రాంచి వైస్ ప్ర సిడెంట్ లు హాజరుకానున్నారు.

ఈ సమావేశంలో సింగరేణి భవిష్యత్, సంస్థ పరిరక్ష ణ, కార్మికుల సమస్యలు చర్చించి భవిష్యత్ నిర్ణయాలు ప్రకటిస్తామని, సంస్థ ప్రగతి, కార్మిక సంక్షేమం, హక్కుల పరిరక్షణ, భవిష్యత్ పోరాటాలకు రూప కల్పన చేస్తామని పేర్కొన్నారు. నాయకులు ఇజ్రాయిల్ , రా మాచారి, నాగేశ్వరరావు, మురళీకృష్ణ, మ స్తాన్, శ్రీనివాస్,పవన్ కుమార్, సంపత్, ముకేశ్ కుమార్ పాల్గొన్నారు.