15-11-2025 07:45:18 PM
కోదాడ: విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం పాలకమండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళికోట హరికృష్ణ కోదాడకు విచ్చేసిన సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తాళికోట హరికృష్ణ మాట్లాడుతూ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని నాయకులు, కార్యకర్తలు కష్టపడి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ముత్తినేని సైదేశ్వర రావు, ఓరుగంటి ప్రభాకర్ లు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గురవయ్య, నరసయ్య, కృష్ణకాంత్, శ్రీనివాస్, వివేకానంద, శ్రీ వాస్తవ, గోపి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.