15-11-2025 07:45:22 PM
ఒకరు మృతి
కొండపాక: బస్సు బైక్ ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన కుకునూర్ పల్లిలో రాజీవ్ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కుకునూర్ పల్లి మండల కేంద్రానికి చెందిన న్యాలపోగుల నాగరాజు(30 ) బైక్ పై రోడ్డు దాటుతుండగా సిద్దిపేట నుండి సికింద్రాబాద్ కు వెళ్తున్న సిద్దిపేట డిపో ఆర్టీసి బస్సు బైక్ ను ఢీకోట్టడంతో బైక్ పైన ఉన్న న్యాలపోగుల నాగరాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ లో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా నాగరాజు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, పాప, బాబు ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే నాగరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కుకునూర్ పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.