15-11-2025 07:42:20 PM
నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో నివారణపై పోలీస్ శాఖ డిఫెసింగ్ డ్రైవింగ్ సిస్టంపై ప్రజల్లో అవగాహన పెద్దతోందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. శనివారం నిర్మల్ ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసులకు డిజిపి ఆదేశాల మేరకు డిఫెన్స్ డ్రైవింగ్ పై అవగాహన కల్పించినట్లు తెలిపారు. తప్పు దారిలో వచ్చే వాహనాలను ముందుగానే గుర్తించాలి. మొబైల్ ఉపయోగించే డ్రైవర్లకు దూరంగా ఉండాలి. రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనాల డోర్లు అకస్మాత్తుగా తెరవొద్దు. సిగ్నల్ జంప్ చేసే వాహనాలను గమనించాలి. అకస్మిక బ్రేకింగ్‌కు దూరంగా ఉండేందుకు అవసరమైన దూరం పాటించాలి. నిర్మల్ పోలీసులు ప్రతి పౌరుడు ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, రోడ్డు ప్రమాదాలను నివారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.