08-11-2025 12:00:00 AM
-సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చు
-జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు,నవంబరు7(విజయక్రాంతి):బాగా చదువుకోవడంతో పాటుసాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడం ద్వారా సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. విద్యార్థినిలకు సూచించారు. శుక్రవారం ములుగు మండలంలోని జగ్గన్నపేట ఆశ్రమ పాఠశాలలో బి.ఈ.ఎల్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సి.ఎస్.ఆర్.(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి) క్రింద జిల్లాలోని 9ఆశ్రమ పాఠశాలలు చిన్న బోయినపల్లి,కర్లపల్లి,లక్ష్మీనగరం,ఏకే ఘనపూర్,జగ్గన్నపేట,మేడారం,తాడ్వాయి చిరుతపల్లి-1,ఊరటం,కే.జీ.వీ. కన్నాయిగూడెం పాఠశాలలకు డిజిటల్ క్లాస్ రూమ్ పరికరాలను సంస్థ తరఫున జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సమక్షంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ జనరల్ మేనేజర్ కె.శ్రీనివాస్ అందచేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమం ములుగు జిల్లాలో చేపట్టడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇంత మారుమూల ప్రాంతాలను ఎంచుకుని మా గిరిజన విద్యార్థిని విద్యార్థులకు పరికరాలను అందించడం ద్వారా విద్యార్థులు పరిజ్ఞానాన్ని పెంపొందించుకొనుటకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు ఎంచుకున్న భాషపై డిజిటల్ విషయ పరిజ్ఞానం తెలుసుకోనుటకు,నేర్చుకొనుటకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
ఈ సందర్భంగా బి.ఈ.ఎల్. భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ జనరల్ మేనేజర్ కే శ్రీనివాస్ మాట్లాడుతూ మా సంస్థ తరఫున అందించే డిజిటల్ క్లాస్ రూమ్ పరికరాల వల్ల విద్యార్థులకు భాష నైపుణ్యాల అవగాహన ఎంతగానో తోడ్పడుతుందని మరియు భవిష్యత్తులో ఈ యొక్క పరికరాల ఉపయోగము వల్ల విద్యార్థులు ఎంచుకొనున్న సబ్జెక్టులో విషయ అవగాహన తోడ్పడుతుందని అన్నారు ముందుగా ఈ కార్యక్రమంలో స్కూల్ నెట్ ఇండియా లిమిటెడ్ సంస్థ అకాడమిక్ మేనేజర్ నర్సింగ్ దాస్ తొమ్మిది ఆశ్రమ పాఠశాలల హెడ్మాస్టర్లకు ,కంప్యూటర్ ఆపరేటర్లకు డిజిటల్ క్లాస్ రూమ్ పరికరాల ఉపయోగం పై ప్రదర్శించి శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏటూరునాగారం డిడి జనార్ధన్, ఏటిడీఓ అజయ్ కుమార్, ఏసీఎంఓ కోడి రవీందర్, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలురమాదేవి, మహిళా జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వేణుగోపాల్, ఉపాధ్యాయులు, బీ ఇ ఎల్ సంస్థ సిబ్బంది, విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.