21-07-2025 12:00:00 AM
- ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా కార్యదర్శి డా.హరికుమార్
హైదరాబాద్, జూలై 20 (విజయక్రాం తి): మధుమేహాన్ని నియంత్రించేందుకు అధునాతన సాంకేతికతను ఉపయోగించుకోవాలని ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా కార్యదర్శి డా.కె.వి.ఎస్. హరికుమార్ సూచించారు. ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా, నిమ్స్ సంయుక్తంగా నిమ్స్‌లో ఆదివారం నిర్వహించిన నేషనల్ ఇన్సులిన్ పంప్ హ్యాం డ్స్-ఆన్ వర్క్‌షాప్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఎండోక్రైనాలజీ ట్రైనీలు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొ న్నారు. టైప్‌హా మధుమేహం చికిత్సలో ఇన్సులిన్ పంపుల వినియోగంపై ఈ వర్క్‌షాప్‌లో వారికి విలువైన శిక్షణను అందిం చారు. దేశంలో అధునాతన మధుమేహ సాంకేతికతలకు పెరుగుతున్న ప్రాధాన్యతను ఈ వర్క్‌షాప్ ఏర్పాటు తెలియచేస్తుందని డా. హరికుమార్ తెలిపారు.
యువ ఎండోక్రినాలజిస్టులకు టైప్ మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రించడానికి అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. టైప్ మధుమేహంతో బాధపడు తున్న పిల్లలకు ఉచితంగా ఇన్సులిన్ పంపులను అందించడంలో దేశంలో తెలంగాణ ప్రభుత్వం అగ్రగామిగా నిలిచిందన్నారు. మధుమేహ బాధిత పిల్లలలో జీవన నాణ్యతను, దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ఆశాజనక ఫలితాలను చూపిందని తెలిపారు.
ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేయడం నిమ్స్‌కు గర్వకారణమని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప తెలిపారు. దేశంలో ప్రత్యేక ఆరోగ్య అవసరాలను తీరుస్తూ ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా క్లినికల్ నైపుణ్యాన్ని పెంపొందించడమే తమ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. నిమ్స్ ఎండోక్రినాలజీ విభాగం నుండి ఫ్యాకల్టీ ఆర్గనైజర్లుగా డా. సుమన కున్నూరు, డా. బీట్రైస్ అన్నే ఈ వర్క్‌షాప్‌ను పర్యవేక్షించారు.