23-10-2024 03:24:11 PM
కొడంగల్ (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల తహశీల్దార్ వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. కొడంగల్ మండల తహసీల్దార్ విజయ కుమార్ బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఓటర్ లిస్ట్ లో ఓటర్ల నమోదుపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలుపాలని అన్నారు. ఇంకా ఎవరైనా 18సం. నిండి ఉన్నట్లయితే ఓటర్ గుర్తింపు కొరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.