05-10-2025 12:28:44 AM
అశ్వరావుపేట, అక్టోబర్ 4, (విజయక్రాం తి): దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆయిల్ ఫామ్ హబ్‌గా మారనుందని, ఉమ్మడి పది జిలాల్లో 11 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయిల్ ఫెడ్ చైర్మ న్ జంగా రాఘవరెడ్డి అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామంలో తెలంగాణ ఆయిల్ ఫామ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోటయ్య ఆయిల్ ఫామ్ గార్డెన్‌లో ఆయిల్ పామ్ రైతు అవగాహనా మేళా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు పాల్గొని మాట్లాడారు. రాఘవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు సు మారు 2. 70లక్షల ఎకరాలు ఆయిల్ పామ్ సాగులో ఉందని, రానున్న కాలంలో 11 లక్షల ఎకరాలు సాగు టార్గెట్ కు చేరుకునేందుకు సమావేశం నిర్వహించినట్టు తెలిపారు.దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం తక్కువగా ఉన్నందున తెలంగాణకు రైతులకు సువర్ణ అవకాశం అన్నారు.
సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో ఆధునిక టెక్నాలజితో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్ ఏర్పాటు చేస్తున్నామని రాఘవరెడ్డి తెలిపా రు. మంత్రి తుమ్మల చొరవతో ముఖ్యమంత్రితో చర్చించి నర్మెట్టలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆయిల్ పామ్ కర్మాగారం స్థాపనకు అన్ని రకాల అనుమతులు ఇచ్చారన్నారు. ఈ ఫ్యాక్టరీని అతి త్వరలో ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు.
అయిల్ పామ్ సాగులో తెలంగాణ రాష్ట్ర విజయానికి పూర్తి క్రెడిట్ మంత్రి తుమ్మలకు చెందుతుందన్నారు.లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలు తెలంగాణలో 11 లక్షల ఎకరాలు పూర్తిచేసే దిశగా తుమ్మల సీఎంని ఒప్పించి ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఆయిల్ ఫామ్ రైతులకు అందుబాటులో ఉండేలా 11 జిల్లాల్లో కొత్త ఫ్యాక్టరీలు నిర్మిస్తామన్నారు. దీంతో పాటు రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలు, నర్సరీలు, కర్మాగారాలు, డ్రిప్ పద్ధతి, అంతర పంటలు అం దించేందుకు చర్యలు జరుగుతున్నాయన్నారు.
రైతు లకు కనీస హామీ ధర, వారికి భరోసా కల్పించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి, ప్రతి మెట్రిక్ టన్నుకు ఎఫ్‌ఎఫ్‌బీ రూ. 25 వేల నుంచి 30 వేల-- వరకు కనీస హామీ ధర అమలు చేయించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
సభలో ఆలపాటిని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫార్మ్ రైతు ప్రెసిడెంట్‌గా ప్రకటించారు. కార్యక్రమంలో అశ్వరావుపేట, సత్తుపల్లి, కొత్తగూ డెం ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, మట్టా రాగమయి, కూనంనేని సాంబశివరావు, రైతులు పాల్గొన్నారు.