calender_icon.png 21 November, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్‌ 2024-25కు ఆమోదం తెలిపిన తెలంగాణ కేబినెట్

25-07-2024 11:17:09 AM

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముగిసింది. రాష్ట్ర బడ్జెట్ కు మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ పద్దును గవర్నర్ కు అందించనున్నారు. బడ్జెట్ పద్దును సభాపతి, మండలి ఛైర్మన్, సీఎంకు భట్టి విక్రమార్క అందించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అటు మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు .