calender_icon.png 28 September, 2025 | 12:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సంస్కృతి బతుకమ్మ

21-09-2025 12:00:00 AM

తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజులపాటు రోజుకో తీరున బతుకమ్మను పూలతో పేరుస్తూ జరిపే పండుగ. వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పండుగ వెనుక కూడా అనేక కథలు ఉన్నాయి. చోళ రాజు అయిన ధర్మంగదునికి 100 మంది కుమారులు పుడతారు. వారందరూ యుద్ధంలో మరణిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో చాలాకాలం తర్వాత వారికి ఆడ పిల్ల పుడుతుంది.

పుట్టిన పసిబిడ్డకు ‘బతుకమ్మ’ అని పేరు పెట్టి నూరేళ్లు బతకాలని ఆశీర్వదిస్తారు. ఆ అమ్మాయే బతుకమ్మగా పూజలు అందుకున్నది. గునుగు, చామంతి, తంగేడు, తోక చామంతి, ఎర్రగన్నేరు, గడ్డి పువ్వు, బంతి ముద్దబంతి, రకరకాల పువ్వులను సేకరించి బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మ పైన పసుపు ముద్ద ను నిలిపి గౌరీ దేవిగా పూజలు చేస్తారు. బతుకమ్మ ప్రకృతితో ముడిపడిన పండుగ. పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణకే దక్కింది.

తొమ్మిది రోజులు  తొమ్మిది పేర్లతో బతుకమ్మను కొలుస్తారు. మొదటిరోజున ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజున అటుకుల బతుకమ్మ, మూడోరోజు  ముద్దపప్పు బతుకమ్మ, నాల్గ వ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు  అట్ల బతుకమ్మ, ఆరో రోజు  అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు  వెన్నెముద్దల బతుకమ్మ, చివరగా తొమ్మి దో రోజును సద్దుల బతుకమ్మగా  పిలుస్తారు. బతుకమ్మ పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా బతుక మ్మ ప్రస్తావన ఆట పాటలతో ఉద్యమం జరగడం విశేషం. 

                                                   రమేశ్, సిద్దిపేట