calender_icon.png 28 September, 2025 | 1:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమ, ఆప్యాయతను పంచుదాం

21-09-2025 12:00:00 AM

(నేడు ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం) :

మతిమరుపు వ్యాధి గురించి ప్రజలో ్లఅవగాహన కల్పించడం, వృద్దులకు వైద్య జాగ్రత్తలపై అవగాహన కల్పించడమే అల్జీమర్స్ దినోత్సవం ఉద్దేశం. సాధారణంగా మతిమరుపు అనేది నాడీ సంబంధిత వ్యాది. వారసత్వం, జన్యుపరమైన లోపాలు, అమైలోడ్ ప్లాక్వీన్, తౌ ట్యాంగిల్స్ వంటి కారణాలతో మతిమరుపు సంభవిస్తుంది. ఈ వ్యాధి వల్ల స్మృతి శక్తి నశించి,ఆలోచన క్షిణించి రోజు వారి కార్యక్రమాలు కూడా సరిగ్గా నిర్వహించుకోలేరు.

ఇది డిమెన్షియా లోని ఒక భాగం. ఈ వ్యాధితో బాధపడేవారు చిన్న విషయాలు సహా పేర్లు, తేదీలను గుర్తుపెట్టుకోలేకపోవడం, సమయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ప్రవర్త నలో విచిత్ర మార్పులు కనిపిస్తుంటాయి. ఇప్పటివరకు మతిమరుపును పూర్తిగా నయం చేసే మందులు లేవు. కొన్ని ఔషధాలు మాత్రం మతిమరుపు లక్షణాలను నియంత్రి స్తాయి.

ఈ వ్యాధితో బాధపడేవారికి కుటుంబ సభ్యులు తమ ప్రేమను, ఆప్యాయతను పంచడమే మందులా పనిచేస్తుంది.  ప్రపంచ వ్యాప్తంగా 55 మిలియన్ల మంది మతిమరుపుతో బాధపడుతున్నారు. ప్రతీ సంవత్సరం 10 మిలియన్ల  కేసులు నమోదు అవుతున్నాయి. భారత్‌లో 8.8 కోట్ల మంది అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులున్నారు. 

 ఉమాశేషారావు, కామారెడ్డి