17-12-2025 01:46:35 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): 37వ సబ్ జూనియర్ (అండర్13) జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌టీ తెలంగాణ బాలికలు అద్భుత ప్రతిభను ప్రదర్శించి జాతీయ వేదికపై తమ సత్తాను చాటారు. అండర్ బాలికల డబు ల్స్ విభాగంలో రాష్ట్ర జట్టు ఏకంగా మూడు పతకాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించిం ది. ఈ పోటీల్లో దియా ఆనంద్‌అబ్బా జాధవ్ జోడీ బంగారు పతకం కైవసం చేసుకోగా, ప్రొ డుతూర్ అన్యకైరా జోడీ వెండి పతకం సాధించింది. ల్యోష్యమనస్విని జోడీ కాంస్య పత కం తో నిలిచి తెలంగాణకు మరింత గౌరవం తీసుకొచ్చింది.
ఈ ఘన విజయంపై ప్రముఖ భారత్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తోపాటు తెలంగాణ బ్యాడ్మింటన్ అసో సియేషన్ ప్రతినిధులు, కోచింగ్ సిబ్బంది క్రీడాకారిణులను అభినందించారు. చిన్న వయసు లోనే జాతీయ స్థాయిలో పతకాలు సాధించ డం రాష్ట్ర బ్యాడ్మింటన్ అభివృద్ధికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని అకాడ మీల్లో అందు తున్న నాణ్యమైన శిక్షణ, క్రమశిక్షణతో కూడిన సాధన వల్లే ఇలాంటి విజయాలు సా ధ్యమవుతున్నాయని కోచ్‌లు తెలిపారు. క్రీడాకారిణుల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిభపై ఆనందం వ్యక్తం చేస్తూ శిక్షకులకు కృతజ్ఞత లు తెలిపారు.