17-12-2025 01:45:17 AM
బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్
ముషీరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): బీసీలను నమ్మించి మోసం చేస్తున్న రాజకీయ పార్టీలకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తగిన గుణ పాఠం చెప్పాలని బీసీ పొలి టికల్ ప్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన మొ దటి, రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో అత్యధికంగా బీసీలు కైవశం చేసుకున్నారని, అదే తరహాలో 3 వ విడతలో కూడా జనరల్ స్థానా ల్లో సైతం బీసీలు కైవశం చేసుకోవాలని కోరారు కోరారు.
ఈ మేరకు మంగళవారం చిక్కడపల్లిలోని పొలిటికల్ ఫ్రంట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, కన్వీనర్లు ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్, వైస్ చైర్మన్ ఎస్. దుర్గయ్య గౌడ్ లు మాట్లాడుతూ బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలను బొంద పెట్టాలన్నారు.
గత 16 రోజులుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతన్న ఏ ఒక్కరూ కూడా బీసీ రిజర్వేషన్ల పై మాట్లాడకపోవడం సిగ్గు చేటన్నారు. బీసీ రిజర్వేషన్ల పై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. బీసీలంతా ఐక్యమై రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యక్షులు వి. నాగభూషణం, బైరు శేఖర్, దామోదర్, సిం గం నగేష్, మెట్టు దన్రాజ్, సురేష్ పాల్గొన్నారు.