calender_icon.png 24 August, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట

21-04-2025 11:05:06 AM

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్(BRS Working President KTR)కు ఊరట లభించింది. ఉట్నూరు పోలీస్ స్టేషన్(Utnoor Police Station)లో నమోదైన ఎఫ్ఐఆర్ ను హైకోర్టు కొట్టివేసింది. గతేడాది సెప్టెంబర్ లో కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao)పై ఉట్నూరు పీఎస్ లో కేసు నమోదు అయింది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు బుక్ చేశారు. కేటీఆర్ ప్రభుత్వంలో రూ. 25 వేల కోట్ల స్కామ్ చేసినట్లు ఆరోపణలు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ కె.లక్ష్మణ్ తీర్పు వెలువరించారు.