calender_icon.png 14 September, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుల్లో తెలంగాణ

14-02-2025 01:23:19 AM

  1. విభజనకు ముందు మిగులు బడ్జెట్‌లో రాష్ట్రం
  2. కేంద్రం చర్యలు చేపట్టినా ప్రయోజనం శూన్యం
  3. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల
  4. ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ ఎంపీలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: రాష్ట్ర విభజనకు ముందు మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ, ఆ తర్వాత అప్పుల్లో కూరుకుపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్మలా సీతారామన్ రాజ్యసభలో గురువారం మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రస్తావించారు.

విభజన సమయం లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అప్పుల కుప్పగా మారిందన్నారు. ఇది వాస్తవం అని తెలిపిన ఆమె.. కేంద్రం ఎన్ని చర్యలు చేపట్టినా తెలంగాణ అప్పుల్లో కూరుకుపోతోందని వెల్లడించారు. అయితే అప్పుల విషయంలో తాను ఏ పార్టీని తప్పుబట్టడం లేదన్నారు.

ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ పార్లమెంటరీ నియో జకవర్గంలో తొలి రైల్వే స్టేషన్‌ను మోదీ ప్ర భుత్వమే ఏర్పాటు చేసిందన్నారు. రామగుం డం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వమే పునరుద్ధరించిందని గుర్తు చేశారు. ఎరువుల ఉత్పత్తిలో రికార్డు స్థాయిలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచినట్టు వెల్లడించారు.

నిజామా బాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఘన త తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. నిజామాబాద్‌లో మేలిరకమైన పసుపు పండుతుందని సీతారామన్ పేర్కొన్నారు. తెలంగాణకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్‌లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకు న్నట్టు తెలిపారు.

అలాగే వరంగల్‌లో పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం సహా బీబీ నగర్‌లో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసినట్టు వెల్ల డించారు. ప్రస్తుతం బీబీ నగర్ ఎయిమ్స్‌లో కార్యకలాపాలు కొనసాగుతన్నాయని తెలిపారు. 2014 నుంచి తెలంగాణలో 2,605 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణ పనులు జరిగినట్టు పేర్కొన్నారు. 

భారత్ మాల కింద నాలుగు గ్రీన్ కారిడార్లు నిర్మించినట్టు తెలిపారు. తెలంగాణలో రైల్వే ల అభివృద్ధికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 5,337కోట్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఏరుపాలెం నంబూరు మధ్య, మల్కాన్ గిరి పాండురంగాపురం మధ్య 753 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్‌లను నిర్మించినట్టు తెలిపారు.

అలాగే తెలంగాణకు ఐదు కొత్త వందేభారత్ రైళ్లను కేటా యించడంతోపాటు దాదాపు 40 స్టేషన్లు ఆధుకనీకరిస్తున్నట్టు వెల్లడించారు. పీఎంఏవై కింద పట్టణాల్లో 2లక్షల ఇళ్లను నిర్మించి నట్టు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ కింద  31 లక్షల టాయిలెట్ల నిర్మాణం, జల జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్లా  కనెక్షన్లు, 82 లక్షల ఆయుష్మాన్ భారత్ కార్డులను మంజూరు చేసినట్టు తెలిపారు.

వీటితోపాటు 199 జనఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్ల డించారు. బడ్జెట్‌కు ముందు అన్ని రాష్ట్రాల ను సంప్రదిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏ రాష్ట్రంపైనా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపడం లేదని, బడ్జెట్‌లో ఏ రాష్ట్రానికి పెద్దపీట వేయలేదని స్పష్టం చేశారు. కా గా తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై నిర్మలా సీతారామన్ మాట్లాతుండగా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు తమ నిరసన తెలుపుతూ ఆమె ప్రసంగాన్ని అడ్డుకున్నారు.