06-01-2026 11:07:56 AM
హైదరాబాద్: డిజిటల్ పెట్టుబడుల కుంభకోణానికి సంబంధించి ఫాల్కన్ మేనేజింగ్ డైరెక్టర్ అమర్ దీప్‌ను(Falcon Company MD Amardeep) తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయిలో అమర్ దీప్‌ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమర్ దీప్ గల్ఫ్ నుంచి ముంబయి విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయంలో అమర్ దీప్‌ను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అమర్ దీప్ పై అధికారులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
డిజిటల్ డిపాజిట్ల పేరుతో రూ. 850 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. ఫాల్కన్ కంపెనీ యాప్ బేస్డ్ డిజిటల్ డిపాజిట్లతో భారీ స్కామ్ చేసింది.షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో అమర్ దీప్ ప్రజలను మభ్యపెట్టాడు. స్కామ్ వెలుగులోకి రాగానే అమర్ దీప్ దంపతులు దుబాయ్ కి పారిపోయారు. ఇప్పటికే కంపెనీ సీఈవో, అమర్ దీప్ సోదరుడిని అధికారులు అరెస్ట్ చేశారు. అమర్ దీప్‌ను తదుపరి విచారణ కోసం హైదరాబాద్‌కు తీసుకువచ్చే అవకాశం ఉంది. అతడిని కోర్టులో హాజరుపరుస్తారు. దర్యాప్తు కొనసాగుతోందని, రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు, రికవరీలు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.