02-05-2025 01:56:01 AM
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్, మే 1 (విజయక్రాంతి): భారతదేశ జనగననతో పాటు కులగనన చేయాలనీ ఒక చరిత్రత్మక నిర్ణయాన్ని కేంద్ర మంత్రి మండలి తీసుకోవడం దేశ ప్రజలందరు హర్షించదగ్గ విషయం అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగనన & కులగనన ఆధారంగా దేశంలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ది చేకూరుతుందని సూర్యనారా యణ తెలియజేసారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో నిఖిల్ సాయి చౌరస్తా లో నిర్వహించిన ప్రధానమంత్రి మోదీ చిత్రప టానికి పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణపాల్గొన్నారుఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు ప్రధానమంత్రి నరేంద్రమోది చిత్రపటానికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చిత్రపటానికి, ఎంపీ అరవింద్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు దేశ భద్రత విషయంలో ఈ దేశ పౌరులు ఎంతమంది, ప్రక్క దేశాలైన పాకిస్తాన్, బాంగ్లాదేశ్ వివిధ దేశాల నుండి వచ్చిన అక్రమ చొరబాటుదార్లు, రోహింగ్యలు ఎవరనేది పూర్తి లెక్కలు తెలుతాయి అని అన్నారు. దేశాన్ని 60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించిన సమయంలో ఎందుకు దేశమంతట కులగనన నిర్వహించలేదని ప్రశ్నించారు దీనికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. ఒక సామజిక వర్గాన్ని సంతృప్తి పరిచి బీసీలకు అన్యాయం చేసారన్నారు, తెలంగాణాలో నిర్వహించిన కులగనన చెత్త బుట్టలో వేయడానికే ఉపయోగ పడుతుందని, కాంగ్రెస్ నాయకులే దాన్ని తగలపెట్టిన విషయాన్నీ గుర్తు చేసారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు,కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.