calender_icon.png 5 July, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమల్లోకి రానున్న తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ

04-07-2025 12:00:00 AM

టూరిజం శాఖ ఉత్తర్వులు

హైదరాబాద్, జులై 3 (విజయక్రాంతి): తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ విధానం త్వరలో అమల్లోకి రానుంది. ఈ మేరకు గురువారం యూట్ అడ్వాన్స్‌మెంట్ టూరిజం అండ్ కల్చర్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం క్రీడల సామర్ధాన్ని అభివృద్ది చేసేందుకు, ప్రపంచ వేదికపై రాణించేందుకు, ఉత్తమ అథ్లెట్లను రూపొందించి ప్రపంచ క్రీడా నాయకత్వాన్ని పెంపొందించేందుకు తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని రూపొందించింది. ఉన్నత క్రీడా అకాడమీలు ద్వారా అంతర్జాతీ య, జాతీయ అథ్లెట్లను తయారు చేయడమే లక్ష్యంగా ఉండనుంది. 

అట్టడుగు స్థాయి ప్రతిభను పెంపొందించడం ద్వారా తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు కేంద్రంగా మారనుంది. ఈ పాలసీలో ఐదింటిపై దృష్టి సారించారు. వాటిల్లో గవర్నెన్స్ అండ్ ఆర్గనైజేషన్, క్రీడా పర్యావరణ వ్యవస్థ, దీర్ఘకాలిక అథ్లెట్ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాల అభివృద్ధి, కెరీర్ మార్గాలను పొందుపర్చారు.