calender_icon.png 10 January, 2026 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్‌పై తెలంగాణ జట్టు విజయం

09-01-2026 12:00:00 AM

హైదరాబాద్, జనవరి 8 : 19వ రాజీవ్‌గాంధీ ఆలిండియా క్రికెట్ చాంపియన్‌షిప్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. రెం డోరోజు ఎల్బీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తెలంగాణ జట్టు బీహార్ జట్టుపై  64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తెలంగా ణ 20 ఓవర్లలో 6 వికెట్లకు 143 పరుగులు చేసింది. తర్వాత బీహార్ జట్టు కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. తెలంగాణ ప్లేయ ర్ చిరాగ్ యాదవ్ 15 బంతుల్లో 22 రన్స్ చేయడంతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన చిరాగ్ యాదవ్‌కు క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ , మాజీ ఎంపి వీహెచ్ ట్రోఫీ అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ యాదవ్, యూసఫ్, కైలాశ్ కుమార్, రాంబాబు ,శ్రీనివాస్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శంభుల శ్రీకాంత్ గౌడ్, మహేందర్ గౌడ్, అనిరుధ్ గౌడ్, నాగమణీశ్ తదితరులు పాల్గొన్నారు.