09-01-2026 12:00:00 AM
టీసీఏ తెలంగాణ గోల్డ్ కప్
హైదరాబాద్, జనవరి 8: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక తెలంగాణ గోల్డ్ కప్‌లో పలువు రు యువక్రికెటర్లు అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్నా రు. సెంట్రల్ జోన్ లీగ్ మ్యా చ్‌లు మీర్‌పేట్‌లోని టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ప్రారంభమయ్యాయి. మా జీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మ్యా చ్‌లను ప్రారంభించారు. టీసీఏ సైబరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో టీసీఏ రంగారెడ్డి ప్లేయర్ దుర్గా ఉజ్వల్ సెంచరీతో కదంతొక్కాడు.
అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకు న్నాడు. 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ఉజ్వల్ ఇన్నిం గ్స్‌లో 12 ఫోర్లు, 6 సిక్సర్లున్నాయి. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీసీఏ సైబరాబాద్ 19.5 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. తర్వా త ఛేజింగ్‌లో ఉజ్వల్ వి ధ్వంసకర ఇన్నింగ్స్ ఆడడంతో టీసీఏ సంగారెడ్డి 14.3 ఓవర్లలో నే లక్ష్యాన్ని ఛేదించింది. మరో మ్యా చ్‌లో టీసీఏ సంగారెడ్డి జట్టుపై టీసీఏ వికారాబాద్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. నార్త్‌జోన్ లీగ్ మ్యాచ్‌లలో టీసీఏ నిజామాబాద్ 6 వికెట్లతో టీసీఏ ఆర్మూర్‌పై గెలుపొందింది.