calender_icon.png 22 September, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లం నిల్వలపై ఆబ్కారీ శాఖ దృష్టి..

22-09-2025 12:27:57 AM

పండుగ వేళా గుడుంబా తయారీపై నిఘా 

టేకులపల్లి, సెప్టెంబర్ 21,(విజయక్రాంతి):గుడుంబా తయారీపై ఆబ్కారీ శాఖ ద్రుష్టి సారించినట్లు కనిపిస్తుంది. దసరా పం డుగ సందర్బంగా గ్రామాల్లో గుడుంబా తయారీ చేస్తారని తనికీలు చేస్తూ కిరాణా దు కాణాల్లో బెల్లం నిల్వల్ని తనికీ చేస్తున్నారు. ఈ క్రమంలో టేకులపల్లి మండలంలో రెం డు మూడు రోజులుగా ఆబ్కారీ శాఖ సిబ్బం ది కిరాణా దుకాణాల్లో ఎక్కువ తెల్ల బెల్లం ఉంటె పట్టుకెళ్తున్నారు.

పండుగకు వన్డే వం టకాలకు బెల్లాన్ని విక్రయిస్తున్నామని తెలుపుతున్న ససేమిరా అంటూ ముప్పు కిలోల బెల్లం ఉన్న పట్టుకెళ్తున్నారు. ఇదే క్రమంలో కొన్ని దుకాణాల్లో నల్లబెల్లం నిల్వలు కూడా లభించడం విశేషం. టేకులపల్లిలో ఒక కిరా ణా దుకాణంలో 150 కొలువుల నల్ల బెల్లం నిల్వ లభిస్తే ఆబ్కారీ అధికారులు తీసుకెళ్లిన ట్లు స్మమాచారం.

ఆ విషయాన్ని మాత్రం ఆ శాఖా అధికారులు చెప్పిన పాపాన పోవడం లేదు. మరో వైపు గ్రామాల్లో గుడుంబా గు ప్పుమంటున్న పట్టించుకోని అధికారులు, పండుగ అవసరాలకు అమ్మకంకోసం తెచ్చి న తెల్లబెల్లం అమ్మకాలపై ద్రుష్టి పెట్టడంపై కిరాణా దుకాణాల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇబ్బంది పెట్టొద్దని, తాము గుడుంబా తయారీకి అమ్మడం లేద ని స్పష్టం చేస్తున్నారు.