calender_icon.png 13 September, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు ప్రేక్షకులు గొప్ప సినిమాను కాపాడుతారు

13-09-2025 01:41:55 AM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన తాజాచిత్రం ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. షైన్‌స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. శుక్రవారం విడుదలైన తమ సినిమాకు ప్రేక్షకాదరణ లభిస్తోందంటూ మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రెస్‌మీట్‌లో హీరో మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకులు దేవుళ్లు. గొప్ప సినిమాను కాపాడుతారు. ఈ సినిమా మంచి స్థాయికి వెళుతుంది. పవన్‌కళ్యాణ్ ‘ఓజీ’ వచ్చేంతవరకు ఆడుతుంది” అన్నారు. ‘ఈ మూమెంట్‌ను ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటాన’ని డైరెక్టర్ చెప్పారు. ‘మేము అనుకున్న దానికంటే డబల్ ఇంపాక్ట్ రెస్పాన్స్ వస్తోంద’ని నిర్మాత సాహు గారపాటి తెలిపారు. ‘ప్రేక్షకుల స్పందన మాకు గొప్ప బలాన్నిచ్చింద’ని మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ అన్నారు.