12-05-2025 02:49:50 AM
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): రాబోయే 3 రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర తగ్గనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.
మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో గంటలకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తూ, అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుము లు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు ఎల్లోఅలర్ట్ జారీ చేశారు.