calender_icon.png 14 May, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కూల్చివేయడం హేయమైన చర్య

12-05-2025 02:49:18 AM

  1. సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ

చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని వెంటనే పున: ప్రారంభించాలి

ఇబ్రహీంపట్నం, మే 11 : ఇబ్రహీంపట్నంలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం కూల్చివేయడం హేయమైన చర్య అని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఇబ్రహీంప ట్నం పెద్ద చెరువు కట్టకింద ఉన్న చాప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని జాన్ వెస్లీ, టీఎంకెఎంకెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల యాదయ్య, టీఎంకెఎంకెఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మా,పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.సామేల్,కె జగన్, టీఎంకెఎంకెఎస్ జిల్లా అధ్యక్షులు చనమోని శంకర్ లతో కలిసి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. తినే కుడులో మట్టి పోస్తున్నారనీ, చెప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కుల్చాడన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని వెంటనే పున: ప్రారంభించాలనీ జాన్ వెస్లీ అన్నారు. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్ట క్రింద ఉన్న చేప పిల్లలను ఉత్పత్తి చేసే 9 ట్యాంకులను ఎందుకు కుల్చారని  మత్స్యకార సంఘాలతో చర్చించకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా ఎలా కుల్చివేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీని వల్ల మత్స్యకారులకు నష్టం వాటిల్లుతుందని వెంటనే చెప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని పున నిర్మాణం చేయాలని, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 32. చెప పిల్లల ఉత్పత్తి కేంద్రాలలో కూడా స్థలాలు కబ్జాలకు గురై సరైన సిబ్బంది లేకపోవడం వల్ల చెప పిల్లలు ఉత్పత్తి చేయలేక తెలంగాణ రాష్ట్రానికి సూమరు రూ.400 కోట్ల చేప పిల్లలను ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెచ్చుకుంటున్నారని తెలిపారు.

క్కడ సిబ్బందిని కేటాయించి ఉత్పత్తి కేంద్రాల అభివృద్ధి కోసం రూ.500 కోట్ల కేటాయిస్తే ఇక్కడ నుండే చేప పిల్లలను ఉత్పత్తి చేసుకోవచ్చని దాని కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని త్వరలోనే ముఖ్యమంత్రి కి లేఖ రాస్తాన్నారు. మే 15న మత్స్యకారులు నిర్వహించే మహా ధర్నాకు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

అనంతరం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మా మాట్లాడుతూ.. ఉత్పత్తి కేంద్ర కుల్చడం మంచిది కాదని, ఇక్కడ ఉన్న భూమి సర్వే చెయించి అద్దురాళ్లు ఎర్పాటు చేయాలని, చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం పున:నిర్మాణం చేసే వరకు మత్స్యకారుల ఐక్యం చేసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.సామేల్, కందుకూరి జగన్, జిల్లా కమిటీ సభ్యులు సి హెచ్ జంగయ్య, ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి సి హెచ్ బుగ్గరాములు, సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తెలు ఇస్తారి, జిల్లా అధ్యక్షులు చనమోని శంకర్,సోషల్ మీడియా జిల్లా కన్వీనర్  చనమోని రాము,గుడాల బిక్షపతి, దుస వెంకటేష్, బోళ్ల నర్సింహ్మా, మైలారం యాదయ్య, పొన్నల బిక్షపతి, పోచమోని క్రిష్ణ,బి. యాదగిరి తదితరులు పాల్గొన్నారు.