calender_icon.png 13 September, 2025 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెట్ అర్హతపై ఉపాధ్యాయుల్లో టెన్షన్

12-09-2025 12:00:00 AM

తెలంగాణ రాష్ర్టంలోని ప్రభుత్వ, పంచాయతీ రాజ్, ఎయిడెడ్ ఇతర పాఠశాలలలో పనిచేసే ఉపాధ్యాయులు టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్ (టెట్) తో భయాందోళనకు గురవుతున్నారు. మన దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్ట్ తేదీ ఆగస్టు 31న ప్రతి ఒక్క టీచర్ టెట్ ఉత్తీర్ణత సాధించాలని లేదా ఉద్యోగం వదులు కోవాల్సి వస్తుందని ఉత్తర్వులు జారీ చేయడం తో తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఏ రకమైన విధానం అనుసరిస్తుందో అని టీచర్స్ ఎదురుచూస్తున్నారు.

ముఖ్యంగా తెలుగు భాషలో టెట్‌ను నిర్వహించాలని అన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరుకుంటున్నారు. బయాలజీ ఉపాధ్యాయులకు గణితము, భౌతిక శాస్త్రంలో పరీక్షలు నిర్వహించడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను వారి మానసిక వేదనను అర్థం చేసుకొని పేపర్ నిర్వహించి భాషోపాధ్యాయులకు న్యాయం చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 60శాతం, మిగతా వారికి 70 శాతం మార్కులు రావాలనడం సమంజసం కాదు. ఏ పరీక్షలలోనైనా 35 మార్కులకే ఉత్తీర్ణత ఉంటుంది. అలాంటిది టెట్‌లోనూ 75 మార్కులు రావాలన్న నియమం ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తుంది. విద్య ఉమ్మడి జాబితాలో ఉండడం వల్ల తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఏ రకమైన విధానం అమలు చేస్తుందో అని ప్రశ్నార్థకం గా మారింది.

కేంద్ర ప్రభుత్వం లేదా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం.. టీచర్స్‌గా 2010 కంటే ముందు ఉన్న వాళ్ళకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నారు. రాష్ట్రం అవతరించి 11 సంవత్సరాలు గడిచినప్పటికీ ఉపాధ్యాయ సంఘాలకు ఎలాంటి గుర్తింపు లేకుండా ఉండేది. అలాంటిది రేవంత్ ప్రభుత్వం జాయింట్  స్టాప్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసి ఉపాధ్యాయ సంఘాలకు గుర్తింపు ఇవ్వడంపై ఉపాధ్యాయులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

 విజయ్‌భాస్కర్, కరీంనగర్